అంబానీ,అదానీల కోసమే మోడీ సర్కార్ గ్యాస్ ధరలు పెంచిందని ఆరోపించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని..తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్‌లో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా జరిగేదని, నేడు ప్రతినిత్యం నీరు అందుబాటులో ఉన్నదని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తం చేసేందుకే టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిందన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదన్నారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..