రాష్ట్రానికి కేంద్రం నయా పైసా ఇవ్వలేదుఃమంత్రి తలసాని

195
Minister Talasani Srinivas
- Advertisement -

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నయా పైసా ఇవ్వలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఈసందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు మంత్రి తలసాని, ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లలో ఆగస్ట్ 15వరకు హారితహారం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హరిత హారాన్ని ప్రతి ఒక్కరు సామాజిక భాద్యత గా భావించి మొక్కలు నాటాలన్నారు. కరోనా లాంటి వ్యాధులు రావద్దంటే పర్యావరణ పరిరక్షణ కు పాటు పడాలి.

కరోనా కట్టడికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. బీజేపీ ఈ సమయం లో ఆస్పత్రుల దగ్గర ధర్నా చేయడం చిల్లర రాజకీయం అన్నారు. తెలంగాణ కరోనా కట్టడి చర్యలను కేంద్ర బృందం ,వైద్య మంత్రి ప్రశంసించారని గుర్తు చేశారు. ఢిల్లీ లో మర్కజ్ సందర్భంగా కరోనా ప్రబలితే కేంద్ర ఇంటెలిజెన్సు ఏం చేసింది అని ప్రశ్నించారు. …తెలంగాణ కు రావాల్సిన కరోనా టెస్టింగ్ మిషన్ ను బెంగాల్ కు ఎవరు తరలించారని అడిగారు. బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడాలని ఆదేశించారు. కరోనా కు ఎవ్వరూ అతీతులు కారు
కారని.. కరోనా బారిన పడిన వారు చాలా మంది కోలుకుంటున్నారని అన్నారు.

- Advertisement -