రాహుల్‌ గాంధీపై మంత్రి తలసాని తీవ్ర విమర్శలు..

87
minister talasani
- Advertisement -

రైతు సంఘర్షణ సభ.. కాంగ్రెస్ అంతర్గత సభ లాగా ఉంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. మద్దతు ధర ఇస్తమని చెప్పారు కానీ అది రాష్ట్రానికా లేక దేశానికా ఇచ్చేది. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది అప్పుడేందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. కాళేశ్వరం బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గుర్తింపు వచ్చింది. రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. వీల్లేమైన స్టడీ చేసి మాట్లాడుతున్నారా లేదా తెలియదు. టూరిస్టుల్లాగా వచ్చి మాట్లాడుతున్నారు.

నడ్డా, రాహుల్ గాంధీ సభలకు పర్మిషన్ ఇచ్చారు. కొన్ని చోట్లా అక్కడి పరిస్థితులు అక్కడి ఇంఛార్జిలు అనుమతులు ఇవ్వాలి. ఓయూ లో పరీక్షలు జరుగుతున్నాయి, డిస్టర్బ్ చేయొద్దని వీసీ అనుమతి ఇవ్వలేదు. జైల్లో ములాఖత్ కు అధికారులు అనుమతి ఇవ్వాలి అది వాళ్ల పరిధిలో ఉన్న అంశం, ప్రభుత్వానికి ఏం సంబంధం? తెలంగాణ మీరు ఇవ్వలేదు, కేసీఆర్ తెచ్చుకున్నారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాదించుకున్నారు అని మంత్రి తలసాని పేర్కొన్నారు.

- Advertisement -