సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చోని పరిష్కరించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మీడియాతో మాట్లాడిన తలసాని…కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు….ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు.
ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని..లేబర్ డిపార్ట్మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదన్నారు. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. నరేంద్రమోదీ రోజు ప్రపంచం గురించి నీతులు చెబుతారు….ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదన్నారు.
ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్ట పోతుందని..ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదన్నారు. దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుంది….తలెత్తుకుని గర్వంగా నిలబడలేకపోతుందన్నారు. ఎలక్టేడ్ గవర్నమెంట్లు ఉండటం ఓర్వలేక పోతున్నారు…ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారన్నారు.