పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి..

213
- Advertisement -

సోమవారం మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్‌ మహబూబ్ నగర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నగరంలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్ వద్ద డంపింగ్ యార్డ్ కు ఎదురుగా సర్వేనెంబర్ 921 లో మూడు ఎకరాలలో ఏర్పాటుచేసిన హిందూ స్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వీరన్నపేట వీరభద్ర కాలనీలోని శ్రీ పవనపుత్ర ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక అమావాస్య ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

- Advertisement -