నేడు మంత్రులు శ్రీనివాస్ గౌడ్,నిరంజన్ రెడ్డిలు జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించారు.ఇందులో భాగంగా మంత్రులు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జోగులాంబ అమ్మవారి టెంపుల్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. 5వ శక్తి పీఠం అమ్మవారి ఆశీస్సులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. 5వ శక్తి పీఠాన్ని పర్యాటకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్‌ని,కేటీఆర్‌ని చల్లగా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతులు రాగానే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆలయ అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాము. తుంగభద్ర పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం. జోగులాంబ అమ్మవారి గుడి నుండి శ్రీశైలానికి బోటింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
— V Srinivas Goud (@VSrinivasGoud) December 20, 2019