గుడుంబా నిర్మూలనకు పకడ్బందిగా చర్యలు..

366
Minister Srinivas
- Advertisement -

రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేయటం జరిగినది. కరోనా మహమ్మారి వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో వైన్ షాపులు మరియు మద్యపాన షాపుల బంద్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం వినియోగదారులు కోందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం వున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గుడుంబా నిర్మూలనకు పకడ్బందిగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను అదేశించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోని వివిధ సంస్కరణలు చేపట్టి రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్న ఈ సమయంలో కోందరు వివిధ జిల్లాలలో అదిలాబాద్, వరంగల్ రూరల్, మహబుబాబాద్, భూపాల పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం మరియు నాగర్ కర్నూల్ జిల్లాలోని మారు మూల తాండాలలో గుడుంబా తయారు దారులను గుర్తించి ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు కేసులను నమోదు చేసి అరేస్టు చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి అధికారులు తీసుకరావడం జరిగింది. దీనిపై మంత్రి స్పందిస్తూ ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మారు మూల ప్రాంతములో కూడా గుడంబా తయారు కాకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని అవసరమైతే పి డి యాక్టు (P D Act) క్రింద కేసులను నమోదు చేయాలని వీడియే కాన్పరెన్సు లో నిర్థేశాలు జారి చేశారు.

Minister Srinivas Goud

గతంలో గుడుంబా తయారు చేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పునరావాసం కూడా అందించటం జరిగిందన్నారు. అలాగే పునరావసం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6299 మందికి సుమారు 126 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి కెసిఆర్ సహయం అందించారు. ప్రస్తుత లాక్ డౌన్ లో గుడుంబా తయారిదారులను , బెల్లం అమ్మకం దారులను గుర్తించి వారిపై చట్టరీత్య కఠీన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు.  అదే విధంగా ఎక్కడైనా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కు చెందిన క్రింది స్థాయి సిబ్బంది నుండి ఎక్సైజ్ సూపరిండెంటెడ్ స్థాయి వరకు ప్రభుత్వం నిర్థేశించిన విధులలో అలసత్వం ప్రధర్శిస్తే ఆ అధికారి పై తగిన విధంగా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే సస్పెండ్ చేయ్యడం కూడా జరుగుతుందని మంత్రి హెచ్చరించారు.

Srinivas Goud తెలంగాణ ప్రభుత్వం నిర్థేశించిన విధంగా లాక్ డౌన్ నిబందనలకు విరుద్దంగా వ్వవహరించినా, ప్రభుత్వ లక్ష్యానికి శాఖ గౌరవాన్ని కాపాడేవిధంగా అధికారులందరూ పూర్తి సమన్వంతో పనిచేసి గుడుంబా నియంత్రణ చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. మద్యపానము సంబందించి ఆయా ప్రాంతాల నుండి ఏలాంటి వార్తలు వచ్చినచో ఆ ప్రాంత అధికారి మీద తీవ్రమైన చర్య తీసుకోనబడుతుందని మంత్రి అధికారులకు హెచ్చరించారు. అబ్కారి శాఖ జిల్లా ఉన్నతాధికారులు వారి సిబ్బంది తో ప్రతిరోజు సమీక్షలు నిర్వహించాలని, వాటి నివేదికలను మంత్రి కార్యాలయంకు మరియు అబ్కారి శాఖ డైరెక్టర్ కు నివేదించాలని అదేశించారు.

ఈ వీడియో కాన్పరెన్సులో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ అజయ్ రావు, రంగారెడ్డి మరియు మహబుబ్ నగర్ డిప్యూటి కమీషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, సహాయ కమీషనర్ హరికిషన్ తో పాటు వివిధ జిల్లాల ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ లు వీడియో కాన్పరెన్సు లో పాల్గోన్నారు.

- Advertisement -