- Advertisement -
గత ప్రభుత్వాలు గీత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. శాసనసభలో వ్యవసాయం, పశుసంవర్థక, సహకార, పౌరసరఫరాలు, రెవెన్యూ, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, హోం, రవాణాశాఖ పద్దులను ప్రవేశపెట్టారు.
పద్దులపై చర్చలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..గీత కార్మికులకు టీఆర్ఎస్ కు ప్రభుత్వం అండగా ఉందన్నారు. తెలంగాణ వందశాతం గుడుంబా రహిత రాష్ట్రంగా మారిందన్నారు. నాటుసారా తయారీపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించినట్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
- Advertisement -