బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, బసవరాజ్ సారయ్య, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంప గోవర్ధన్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర లతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు…బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:తగ్గిన పేదరికం.. దటీజ్ కేసిఆర్!
సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకు పోతుంటే అక్రోషం తో బీసీలపై మాట్లాడుతున్నారని…బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకునీ టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారు..మా ఓట్ల తో గెలిచి..మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్నారు.
భవిష్యత్ కార్యాచరణను తొందరలో ప్రకటిస్తాం అని…కూలలా వారీగా మీటింగ్ లు పెడుతాం అన్నారు. ముక్కు , చెంపలు వేసుకుంటే తప్పా వారిని వదలం…త్వరలో కాంగ్రెస్ విధానాలను ఎండగడతాం అన్నారు. గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ బీసీలపై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.
Also Read:అల్లం ‘టీ’తో ప్రయోజనాలు..
30 సంవత్సరాల చరిత్ర తమ పార్టీది అని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకోవడం కాదని, పార్టీ నాయకులు మాట్లాడే బాషను మార్చుకోవాలని, అలాంటి వారిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. బిసి లు అంటే అసమర్ధులు అనుకోవద్దని, తాము బాద్యతాయుతమైన పదవులలో ఉన్నందున హుందాగా నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎంతవరకైనా వెనుకాడబోమన్నారు. బిసి లు జనాభాలో 56 శాతం ఉన్నారన్న విషయాన్ని మరచిపొవద్దని, రానున్న రోజులలో మా సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు.