క్రీడా హబ్ గా తెలంగాణః మంత్రి శ్రీనివాస్ గౌడ్

406
minister Srinivas goud
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా రూపోందుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . రాష్ట్ర అబ్కారి , క్రీడా,  పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు  క్రీడా ప్రాధికార సంస్థ  పై లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర క్రీడా ఆథారీటీ మెనెజింగ్  డైరెక్టర్ శ్రీ దినకర్ బాబు గారు, డిప్యూటి డైరెక్టర్ శ్రీమతి సుజాత , లీగల్ మరియు ఎస్టేట్ ఆఫీసర్  శ్రీమతి చంద్రావతి , డా. కె. నర్సయ్య – OSD  స్పోర్ట్స్ స్కూల్ మరియు డిప్యూటి  డైరెక్టర్ , ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విమలాకర్, డిప్యూటి ఎక్స్ క్యూటివ్ ఇంజనీర్ దీపక్ లు పాల్గోన్నారు. 2014 తరువాత తెలంగాణ రాష్ట్రంలో 45 స్టేడియాల నిర్మాణం పూర్తి చేసామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్ఖ అద్వర్యంలో ఉన్న క్రీడా శాఖ కు చెందిన భూములు, స్థిరాస్తులను డిజిటలైజేషన్ చేసి వాటిని సంరక్షించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను అదేశించారు. క్రీడా శాఖ కు చేందిన స్థలాలలో ప్రవేట్ వ్యక్తులు తీసుకున్న లీజుల పై మంత్రి సమీక్షించారు. లీజులు తీసుకోని ప్రభుత్వానికి అద్దేలు ఇవ్వకుండా కోర్టులకు వేళ్లారో వారి వివరాను అందజేయాలని మంత్రి అధికారులను కోరారు. ప్రస్తుతం ఎన్ని స్థలాలు కోర్టు వివాదంలో ఉన్నాయో వాటి వివరాలను ప్రభుత్వానికి అందజేసి వాటిని త్వరగా పరిష్కారించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మార్కేట్ లో ప్రస్తుతం ఉన్న అద్దేల ప్రకారంగా క్రీడా శాఖ కు చెందిన స్థిరాస్తులకు కూడా వర్తింప జేసాలా కార్యచరణ ను రూపోందించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు  తెలంగాణ రాష్ట్రంలో క్రీడా స్టేడియాల లో మౌళిక వసతుల కల్పన ల పై చర్చించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అంతర్జాతీయ స్షాయి క్రీడా వసతులను ఉపయేగించుకోని క్రీడాకారులను ఉన్నతంగా తీర్చి దిద్దాలని మంత్రి అధికారులను అదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి అధికారులను కోరారు. కేంద్ర క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా రూపోందించిన ఖేలో ఇండియా పథకం లో నూతన క్రీడా పాఠశాల కోసం తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు. నూతనంగా నిర్మించే క్రీడా స్టేడియాలను పబ్లీక్ – ప్రవేట్ భాగస్వామ్యం తో అభివృద్ది చేసేలా తగిన ప్రణాళికలను, ప్రతిపాదనలను రూపోందించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -