గీత కార్మికుల అభివృద్ది కోసం నీరా పాలసీ

533
srinivas Goud
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకం నీరా పాలసీ ని ప్రకటించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నీరా ప్రాజెక్టు పై బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో MLC , బాలసాని లక్ష్మీ నారాయణ, MLA ప్రకాష్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ M P డా. నర్సయ్య గౌడ్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్ లతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీరా ఉత్పత్తి, నీరా సేకరణ, నిలువ చేయటం, అనుబంధ ఉత్పత్తుల తయారీ, స్టోర్ పాయింట్ ఏర్పాటు మరియు ప్యాకింగ్ కు సంబందించిన ప్రధాన అంశాల పై అధికారులకు దిశానిర్దేశం ను చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో నీరా ను రాష్ట్రంలో ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. సీఎం కేసీఆర్ గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం తో పాటు మంచి పోషక విలువలు కలిగిన సాంప్రదాయ పానీయం ను సామాన్య ప్రజల ఆరోగ్యం కోసం రూపొందించిన నీరా , అనుబంధ ఉత్పత్తుల తయారిపై అధికారులతో చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో తాడి మరియు అలైడ్ ప్రోడక్ట్స్ రీసెర్చ్ సెంటర్ ను హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నీరా ను రాష్ట్రంలో వీలైనంత త్వరలో తీసుకరావటానికి ప్రణాళికలు రూపొందించి ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని మంత్రి అధికారులను కోరారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా పార్లర్ ను KFC, ఫిజా హట్ స్టోర్ ల మాదిరిగా ఆధునికంగా రూపొందించి నీరా ను అందించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . నీరా పార్లర్ లను త్వరలోనే జిల్లా కేంద్రాలకు విస్తరించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -