ఎక్సైజ్ అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష..

498
- Advertisement -

రాష్ట్ర  అబ్కారి,  క్రీడ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్‌లో రవీంద్ర భారతి లోని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో నిబందనలకు విరుద్దంగా మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ లీక్ అవ్వడం, అక్రమ మద్యం తయారీ, సరఫరా తదితర అంశాలపై ఈ సమీక్షలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చర్చించారు.

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి చర్యలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇందుకు కారకులైన వారి లైసెన్స్ లను సస్పెండ్ చేయడం, భారీ అపరాధ రుసుం విధించడం, కొన్ని తీవ్రమైన కేసులలో లైసెన్స్ ను క్యాన్సల్ చేయడం జరుగుతుందని మంత్రి అధికారులకు హెచ్చరించారు. అలసత్వం ప్రదర్శించినా, సహకరించిన స్థానిక అధికారులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తీసుకున్న చర్యల వల్ల ఆల్కహాల్ విత్‌డ్రాల్ సింటంస్స్‌ చాలా తగ్గిందన్నారు. మొదట్లో రోజుకి 140 నుండి 150 కేసులు ఎర్రగడ్డ ఆసుపత్రికి వచ్చాయన్నారు కానీ నేడు డిపార్ట్మెంట్ వారు తీసుకున్న నివారణ చర్యలు, అవగాహన సదస్సుల వల్ల నేడు రోజుకు 2 లేదా మూడు కేసులకు తగ్గాయిని, త్వరలో మరికోద్ది రోజులలో ఇలాంటి కేసులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.  ఈ సమీక్షా సమావేశంలో మద్యం షాపుల గురించి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నింటినీ పరిశీలించి ఎక్సైజ్ శాఖ టాక్క్ ఫోర్క్ ద్వారా నిజాల ఆధారంగా సత్వరంగా స్పందించి శాఖ తరపున కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

minister srinivas goud

సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి అసత్య వార్తలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అలాగే నిన్న ట్విట్టర్‌లో కూలీలకు మద్యం పంచుతూ హైదరాబాద్ లోని చంపాపేట నుండి వచ్చిన వీడియో ఆధారిత ఫిర్యాదును అబ్కారి శాఖ అధికారులు నాలుగు, ఐదు గంటల్లోనే సదురు వ్యక్తిని సంజు కుమార్‌ను గుర్తించి అరెస్టు చేయడం, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్- 34 (ఎ) , 8 (బి) (ii) ఆప్ ప్రోషిబిషన్ యాక్ట్ 1995 ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మద్యం కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ మద్యం తయారు చేసి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నా వారిని, గుడుంబా మరియు అక్రమ మద్యం తయారు దారులను గుర్తించి వారిపై కఠీన చర్యలు తీసుకోవాలని మంత్రి అబ్కారి శాఖ కమీషనర్‌ను అదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఎక్కడైనా మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం సరఫరా జరిగినట్లయితే సంబంధిత స్థానిక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు ఎక్సైజ్ సూపర్డెంట్ మీద తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులను హెచ్చరించారు.

లాక్ డౌన్ తర్వాత అన్ని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ సిబ్బంది చేత సీలు వేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అక్రమ మద్యం అమ్మిన వారిపై సుమారు 675 కేసులను పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం మరియు గుడుంబా తయారీ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో అబ్కారి శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్, జాయింట్ కమీషనర్ అజయ్ రావు, తెలంగాణ బెవరేజేస్ కార్పోరేషన్ ప్రత్యేక అధికారు సంతోష్ రెడ్డి,అసిస్టేంట్ కమీషనర్ హరికిషన్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ మరియు తదితర డిప్యూటి కమీషనర్లు వివేకనందా రెడ్డి , ఖురేషి, కె ఎ బి శాస్త్రీ, ఎక్సైజ్ సూపరిడెంట్ లు దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య, జనార్ధన్ రెడ్డి , శీలం శ్రీనివాస్ రావు, గణేష్ గౌడ్, ప్రధీప్ రావు, రఘురామ్ మరియు అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -