టూరిజంలో అగ్రభాగాన ఉండాలన్నదే మా లక్ష్యం..

544
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచ పర్యాటక దినోత్సవం లో భాగంగా ఈ సంవత్సరం అరుదైన రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది తెలంగాణ పర్యాటక శాఖ. జాతీయ పర్యాటక అవార్డు వేడుకను భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ 2019 సెప్టెంబర్ 27న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో “ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు 2019” నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అథితిగా విచ్చేసి విజేతలకు అవార్డులను అందజేశారు

తెలంగాణ పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సి. పార్థసారథి, IAS,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైఏటీ అండ్ సి డిపార్ట్మెంట్, సునీతా ఎం భగవత్ IFS,పర్యాటక శాఖ కమిషనర్ బి. మనోహర్, మేనేజింగ్ డైరెక్టర్ (ఆ భా), తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అవార్డును అందుకున్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ న్యూఢిల్లీలోని తెలంగాణభవన్ వద్ద ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్నారు.

Minister Srinivas Goud

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ టూరిజం, హాస్పిటల్ టూరిజం రెండింటికి అవార్డులు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గత 5 ఏండ్లలో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు రెట్టింపు అవుతున్నారు. దాదాపు 3లక్షలకుపైగా విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారు.అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఉన్నటువంటి ప్రదేశాలను విస్తృత ప్రచారం కల్పించారు. తెలంగాణకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు కోహినూర్ వజ్రం కూడా ఇక్కడే షోకేజ్ పెట్టారు. అంతేకాదు 10వేల సంవత్సరాల క్రితం ఇక్కడి మనుషుల జీవిత విశేషాలు బయటపడ్డాయి. హైదరాబాద్ హాస్పిటల్ టూరిజం దేశంలో అగ్రభాగాన ఉంది. సంపన్న దేశస్తుల వారు కూడా హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేసుకుంటున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

అలాగే ప్రపంచంలో సుమారు సగ భాగం ఫార్మా ఉత్పత్తులు మనవే.. అనేక దేవాలయాలు, బౌద్ధ ఆలయాలు, ప్రాచీన కట్టడాలు చరిత్ర కిలిగిన ఎన్నో ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.గత ప్రభుత్వాలు రాష్ట్ర టూరిజంను పట్టించుకోలేదు.పర్యాటక ప్రాంతాల సమాచారం అందుబాటులో ఉంచలేదు. టూరిజంలో అగ్రభాగాన ఉండాలన్నదే మా లక్ష్యం. జోగులంబా దేవాలయం ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లాలో అనేక రకాల దేవాలయాల పర్యటనకు ఒక సర్క్యూట్ చేసినం. దానితో పాటు మరో రెండు సర్క్యూట్ లకు సహాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని మంత్రి తెలిపారు.

sports minister

50, 60 వేల కోట్ల రూపాయల నిధులను వివిధ పన్నుల రూపంలో కడుతున్నాం. దేశంలో అధిక పన్నులు కట్టే రాష్ట్రంలో మాది ఒకటి. మేము ఇచ్చే నిధుల్లో 60, 70 శాతం మాకు ఇస్తే అభివృద్ధి పనులు చేసుకుంటాం. మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు 30కి పైగా పార్టీలను ఒప్పించాడు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చేలా నాయకులు కృషి చేయాలి. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్ లలో ఏదోఒకటి జాతీయ హోదా.. పర్యాటక అభివృద్ధికి సహకరించాలి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వరంగల్ లో బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభం అవుతాయి..హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ముగింపు ఉంటుంది. ఢిల్లీలో కూడా ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -