టీఆర్‌ఎస్ పేదల ప్రభుత్వం- మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

138
Minister Srinivas Goud
- Advertisement -

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ జనసభ ఆధ్వర్యంలో మతతత్వ రాజకీయాలు తెలంగాణ వాదుల పాత్రపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్,శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ జనసభ కన్వీనర్ రాజారామ్ యాదవ్,విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..బీసీలకు అడగగానే రేజర్వేషనలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. బీసీలను బీసీలు పెళ్లి చేసుకోవడం ద్వారా ఐక్యత వస్తుంది. బీసీల ఐక్యంగా ఉండటం ద్వారా డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని మంత్రి అన్నారు. 5వేల కోట్ల విలువైన భూములు, భవనాలు ప్రభుత్వం ఇచ్చింది. బీసీ అట్టడుగు వర్గాలను ప్రభుత్వం అదుకుంటుంది. బీసీ అందరూ ఒక్క తాటి పైకి రావాలి.టీఆర్‌ఎస్ పేదల ప్రభుత్వం..పార్లమెంట్‌లో జ్యోతి రావు పూలే విగ్రహం మోడీ ఏర్పాటు చేస్తే,చరిత్రలో మిగిలిపోతారు అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పూలే, ఆయన సతీమణి ఎన్నోన్నో అవమానాలు భరించి, జీవితాలు త్యాగం చేశారు.పేదరికానికి, కులాలు మతాలు ఉండటానికి స్వాతంత్రం అవసరం అని భావించారు. సంపద అందరి అవసరాలు తీర్చేదిగా ఉండాలని అంబెడ్కర్ భావించారు. ఇన్ని వైవిద్యాలు ఉన్న దేశంలో అదరిని రాజ్యగం కలిపి ఉంచుతుందని భావిస్తున్నాం.సమాజంలో చైతన్యం తగ్గిపోతే లేకపోతే రుగ్మతలు వస్తాయి. మహనీయులు స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని మంత్రి ఈటెల కోరారు.

- Advertisement -