10k She 5 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి..

507
10k shi 5 run
- Advertisement -

ఈ రోజు బంజారాహిల్స్‌లో 10కే షీ 5 బ్రోచర్‌ని క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. నెక్లెస్ రోడ్‌లో నవంబర్‌ 24 2019 న 10K Run జరగనుంది. ఈ రన్‌ని హైదరాబాడ్ 10k ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రజల్లో ఫిట్నెస్ అండ్ హెల్త్ పై అవగాహన కల్పించేందుకు ఈ రన్ నిర్వహిస్తున్నామంటు ఆర్గనైజర్లు తెలిపారు.

minister srinivas goud

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ అంటే వాలీబాల్, క్రికెట్ ఏ కాదు. రన్నింగ్ కూడా ఒక స్పోర్ట్ ఏ.రన్ చేయడానికి స్పెషల్‌గా స్టేడియం, గ్రౌండ్ లు అవసరం లేదు. ఉన్న ప్లేస్ లొనే పరుగెతోచ్చు..రన్ చేయడం వల్ల ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. అన్ని ప్రభుత్వమే చేయాలంటే కష్టం. ఇలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావాలి అని మంత్రి అన్నారు.

10k runని విజయవంతంగా నిర్వహిస్తున్న వారికి నా అభినందనలు. 10k runని హైదరాబాద్ తో పాటు.. అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలని కోరుతున్న.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం.భవిష్యత్‌లో హైదరాబాద్… ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారుతుంది అని తెలిపారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

- Advertisement -