గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి- మంత్రి

217
minister srinivas goud
- Advertisement -

శనివారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, ఎంపీపీ కళావతి, మూసపేట సర్పంచ్ అన్నపూర్ణ, రైతుబంధు మండల కో -ఆర్డినేటర్ రఘుపతి రెడ్డి, వ్య వసాయశాఖ సహాయ సంచాలకులు యశ్వంతరావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు.గతంలో విద్యుత్, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని, సర్పంచులు ప్రజలకు జవాబుదారీగా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రస్తుతం విద్యుత్‌కు ఎలాంటి సమస్య లేదన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వేసవిలో చెరువులు, కుంటలు నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తానని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -