క్రీడా హబ్‌గా తెలంగాణ- మంత్రి శ్రీనివాస్ గౌడ్

161
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సోమవారం ఆయన హైదరాబాద్ లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అనంత్ బజాజ్ మెమోరియల్ BAI సిరీస్ సీనియర్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ – 2021ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ నగరం క్యాపిటల్‌గా మారిందన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుల తయారీ కేంద్రంగా, ఎంతో మంది క్రీడాకారులను ఒలంపియన్ లుగా, చాంపియన్ లుగా క్రీడాకారులను గోపిచంద్ అకాడమీ తీర్చిదిద్దుతున్న సంస్థగా అభినందించారు.

క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో అనేక చర్యలను తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా పాలసీని తయారు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా క్రీడాకారులకు క్రీడల్లో 2 శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య లో 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు క్రీడాకారులతో కలసి బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమంలో పుల్లెల గోపిచంద్, పూజ బజాజ్, మయంక్ అగర్వాల్, శ్రీకాంత్ కిదాంబి, సాయి ప్రణీత్, చాముందేశ్వరి నాధ్, BAT అధ్యక్షుడు ఒమర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -