మానవత్వం చాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.

31
srinivas
- Advertisement -

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలోని 16 వ వార్డు లో గల బోయపల్లి లో దళిత బంధు కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ లను, సెంట్రింగ్ యూనిట్లు ను అర్హులైన దళిత సోదరులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వార్డు లోని సమస్యల పరిష్కారం లో భాగంగా పలువురు, ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలతో పర్యటించారు.

ఈ పర్యటన లో బోయపల్లి కి చెందిన కావలి లక్ష్మీ తండ్రి కాంతయ్య, తల్లి వెంకటమ్మా ల దీనస్థితి సమాచారం తెలుసుకొని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకొని స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆమె స్థితి పై చలించి పోయారు. ఆమె దీనస్థితి కి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో ఒక పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి వెన్నుముక విరిగి కాళ్లు చచ్చిపడి పోయి మంచానికి పరిమితం అయి తల్లి సహాయం తో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు ఆధారపడి జీవనం సాగిస్తున్న కావలి లక్ష్మీ అనే బాలిక కు అండగా నిలిచారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఆమె స్థితికి చలించిన మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు వెంటనే చలించి వీరన్న పేట లో ఉన్న డబుల్ బెడ్ ఇంటిని తక్షణమే కేటాయించారు. ఈ రోజే గృహ ప్రవేశం జరిగేలా వారికి సాయంగా ఉండేలా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ మోతిలాల్ ను, TRS నాయకులు శ్రీ శరత్ చంద్ర, పత్తి వెంకట్రాములు, వినోద్ గౌడ్, ఆంజనేయులు, సత్యం లను కోరారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేలా కావలి లక్ష్మీ తల్లి వెంకటమ్మా కు రెసిడెన్షియల్ పాఠశాల లో స్వీపర్ గా నియమించి అండగా నిలిచారు. బోయపల్లి కి చెందిన కావలి లక్ష్మీ దీన స్థితిపై చలించి తక్షణం అండగా నిలిచినందుకు స్థానిక ప్రజలు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారికీ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -