కాంగ్రెస్, బీజేపీలు ఒక్క సీటు కూడా గెలవవుః మంత్రి శ్రీనివాస్ గౌడ్

268
srinivas goud
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్ధులకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాల్టీతో ప్రచారం గడువు ముగియనుండటంతో మహబూబ్ నగర్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రచారంలో పాల్గోన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 16సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు తమకు కనీస పోటి కూడా ఇవ్వవని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలే టీఆర్ఎస్ అభ్యర్దులను గెలిపిస్తాయని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఆదరించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిని, ఇతర ప్రాంతాల వారిని మళ్లీ బరిలోకి దించాయని..ఈసారి కూడా వారికి మళ్లీ ఓటమి తప్పదన్నారు.

- Advertisement -