ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఎత్తయిన పర్వతం ఖిలిమంజరో (5895 మీటర్లు) (19,340 ఫీట్లు) ను అతిపిన్న వయస్సు కలిగిన పర్వతారోహకుడు మాస్టర్ విరాట్ చంద్ర (8 ఏళ్లు) అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈరోజు హైదరాబాద్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డా. అబ్రాహాంలతో కలసి మాస్టర్ విరాట్ చంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు అందుకున్నాడు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాస్టర్ విరాట్ చంద్ర భవిష్యత్‌లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాలను, క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. త్వరలో క్రీడా పాలసీని ప్రవేశపెడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల హబ్‌గా తీర్చిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాస్టర్ విరాట్ చంద్ర తల్లిదండ్రులు శరత్ చంద్ర, మాధవి, కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్, వేద కుమారి తదితరులు పాల్గొన్నారు.