త్వరలో ఎక్సైజ్‌శాఖలో పదోన్నతులు: శ్రీనివాస్ గౌడ్

86
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రిడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను MLA లు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డితో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ను గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులను ఆదేశించారు. త్వరలో ఎక్సైజ్ శాఖ లో పదోన్నతులు, బదిలీలను చేపట్టనున్నామన్నారు. ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి A. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రావు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్,కోశాధికారి లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధుబాబు, విజయ్ కుమార్, వివిధ జిల్లాల ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులు దేవేందర్ రావు, హనుమంతరావు, విజయ్ కుమార్, స్టీవెన్ సన్, K. శ్రీనివాస్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -