మహిళా న్యాయవాది హత్య ఘటనపై సీతక్క

34
- Advertisement -

మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో మహిళా యువ న్యాయవాది స్వప్న హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్త సంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితిగా మారిందని ఆమె పేర్కొన్నారు.

కుటుంబ బంధాలే రక్షణగా ఉండాల్సిన సమయంలో, అవే ప్రాణాలు తీసే స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమని అన్నారు. న్యాయవృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ముందుకు వచ్చిన ఓ యువతి ఇలాంటి దారుణ హత్యకు బలవడం అత్యంత బాధాకరమని మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచనలోకి నెట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Also Read:‘ధురంధర్’2లో యామీ గౌతమ్!

- Advertisement -