సంపద సృష్టించే స్థాయికి మహిళా సంఘాలు!

9
- Advertisement -

SERP వార్షిక యాక్షన్ ప్లాన్ 2025-26 కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకారం ఉండాలి అని తెలిపారు.

పెద్ద పెద్ద వాళ్లే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలు వెళ్లిపోయారు… కానీ మహిళా స్వయం సహాయక బృందాలు నిబద్ధతతో రుణాలను తిరిగి చెల్లిస్తున్నాయి అని వెల్లడించారు. మహిళా స్వయం సహాయక బృందాలు స్వయం ఉపాధి స్థాయి నుంచి సంపద సృష్టించే స్థాయికి ఎదిగాయి అని తేల్చిచెప్పారు.

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ జీతాలు సకాలంలో చెల్లిస్తున్నామని తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Also Read:Kannappa:క‌న్న‌ప్ప‌..మేకింగ్ వీడియో!

- Advertisement -