చైల్డ్ ట్రాఫికింగ్‌..కఠిన చర్యలు: సీతక్క

1
- Advertisement -

చైల్డ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు మంత్రి సీతక్క. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. సంతానం లేనివారు దత్తత నియమాలు, నిబంధనలను అనుసరించి దత్తత తీసుకోవాలి అన్నారు.

చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదు అని.. అక్రమ పద్ధతుల్లో దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటాం అన్నారు. చైతన్యపురిలో రక్షించబడిన చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరికేంతవరకు చిన్నారులు మా శాఖ సంరక్షణలో ఉంటారు .. ప్రస్తుతం చిన్నారులు క్షేమంగా ఉన్నారు అన్నారు.

హైదరాబాద్-చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చిన్నారులను రక్షించారు చైతన్యపురి పోలీసులు. వీరిని మధురానగర్‌లోని శిశువిహార్‌కు తరలించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Alo Read:ఆరు గ్యారెంటీలు..గోవిందా: కేటీఆర్

- Advertisement -