కోలుకుంటున్న శ్రీతేజ్: సీతక్క

3
- Advertisement -

శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడన్న ఆశతో ఉన్నాం…నూతన సంవత్సరంలో చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యవంతుడై వస్తారన్న నమ్మకం ఉందన్నారు మంత్రి సీతక్క. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నాం… శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకుంటున్నాం అన్నారు.

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పారు సీతక్క. సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు.

బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకి వచ్చాడు…శ్రీతేజ్ కుటుంబానికి మా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. శ్రీ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఇటు ప్రభుత్వం.. అటు డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.

Also Read:ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -