సమ్మక్క- సారలమ్మలకు పూజలు చేసిన మంత్రి..

152
- Advertisement -

మినీ మేడారం జాతర ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం గట్టమ్మ వద్ద అమ్మవారిని దర్శించుకుని, మేడారంలో సమ్మక్క- సారలమ్మలకు చీరె పెట్టి పూజలు చేశారు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు వసతులు కల్పించేందుకు గత నెల రోజులుగా అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో శుద్ధి చేసిన తాగునీరు, కావల్సినన్ని టాయిలెట్లు, ఎక్కువ మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. మంత్రి వెంట మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, టీఆర్ఎస్ నేతలు గోవింద్ నాయక్, కిషన్ నాయక్, మధుకర్ రెడ్డి, భవాని, ఇతర స్థానిక నాయకులున్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసిఆర్‌కు మరింత శక్తినివ్వాలని మేడారం సమ్మక్క -సారలమ్మలను కోరుకున్నట్లు తెలిపారు. గత మేడారం జాతర పూర్తయిన వెంటనే కోవిడ్ రావడంతో ఈ మినీ మేడారం జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని, పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. మేడారం వన దేవతలను దర్శించుకునేందుకు ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలు చేశామన్నారు. జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ జాగ్రత్తలు పాటించి,అమ్మవార్ల దర్శనాలు చేసుకోవాలని కోరారు.

- Advertisement -