తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలోని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా గిరిజనులను ఓటు బ్యాంకు గానే చూశారని..సీఎం కేసీఆర్ మాత్రం తండాలని గ్రామ పంచాయతీలుగా చేసి రాజ్యాధికారం గిరిజనులకే ఇచ్చారని పేర్కొన్నారు.
దేశంలోనే అత్యధిక గురుకుల విద్యాలయాలను తెలంగాణలో ఏర్పాటు చేశారని..ఒక్కో విద్యార్థిపై ఏటా 1,20,000 ఖర్చు చేస్తున్నామని వివరించారు. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ కింద 1,00,116 ఇస్తున్నామని దీంతో బాల్యవివాహాలు తగ్గాయని చెప్పారు. ఆడపిల్లలకు అన్ని సమస్యలకు ఒకే చోట పరిష్కారం చేసే విధంగా సఖి సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
minister satyavathi rathod speech in Hyderabad