నకిలీ విత్తనాలను అరికట్టాలిః మంత్రి సత్యవతి

365
satyawathi
- Advertisement -

నకిలీ విత్తనాలు సరాఫరా చేస్తున్న వారిపై కఠని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ . మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు అధ్యక్షతన నేడు పరిషత్ తొలి సమావేశం జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలిని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం రైతులకు అందించే ప్రతి పథకం లబ్దిదారులకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు నీరు అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని చెరువుల్లో నింపే విధంగా కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, సీతక్క, కలెక్టర్ శివలింగయ్య, జడీ సీఈవో సన్యసయ్య, జడీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -