ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని కోరారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈవిషయంపై కేంద్రం పై ఒత్తిడి చేసేందుకు త్వరలో ఎంపీ లతో కలిసి ఢిల్లీ వెళ్తానని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా డొర్నకల్ నియోజకవర్గానికి రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన మహిళనైన తనుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేసి సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారన్నారు. నాపై నమ్మకం ఉంచి ఈపదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదలు తెలిపారు.
నా రాజకీయ ఎదుగుదలకు కారణమైన డొర్నకల్ నియోజకవర్గ అభివృద్దికి పాటుపడుతానన్నారు. గిరిజనుల అభివృద్దికి సీఎం కేసీఆర అనేక అభివృద్ది పథకాలు చేపట్టారు. మూడు వేలకు పైగా తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి నియోజక వర్గాన్ని అభివృద్ది చేస్తానని చెప్పారు.