- Advertisement -
తెలంగాణ లో రైతు రాజు కావాలన్నదే ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు జిల్లాలో నియంత్రిత సాగు అవగాహన కార్యక్రమంలో ఎంపీమాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యలతో కలిసి పాల్గొన్నారు సత్యవతి రాథోడ్.
ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్…నియంత్రిత విధానంలో సాగుతో రైతుకు మేలు జరుగుతుందన్నారు. మన అవసరాలు తగ్గట్లు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలన్నారు.
రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు వల్ల రైతులు కౌలుకు ఇవ్వకుండ సాగు చేసుకుంటున్నారని… 30వేల కోట్ల రూపాయలతో రైతుల ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయలేదని… అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండి మార్గనిర్ధేశనం చేయాలి, కావల్సినవి అందించాలన్నారు.
- Advertisement -