మారుమూల ప్రాంతాల్లోని గిరిజన మహిళలను డిజిటల్ లీడర్స్ గా తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మాసబ్ టాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్, 2వ అంతస్తు, ఎస్.ఆర్. శంకరన్ హాల్ లో ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ ప్రోగ్రాం కింద ట్రైబల్ ఎంటర్ ప్రెన్యుర్స్ కి డిజిటల్ డివైజ్ లను పంపిణీ చేశారు సత్యవతి రాథోడ్.
ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి…గిరిజన డిజిటల్ మహిళా నాయకురాళ్ల కార్యక్రమం ఇది రెండోదన్నారు. డిగ్రీ వరకు రావడమే గొప్ప అనే భవన్ నుంచి ఇప్పుడిప్పుడే గిరిజన మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగాల వైపు వస్తున్నారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ సీఎం కేసిఆర్ నాయకత్వంలో చాలా ముందుకు వెళ్తుందన్నారు.
విద్య ఒకటే సమాజంలోని అసమానతలను తగ్గిస్తుందని ఆలోచించిన సీఎం కేసిఆర్ గారు తెలంగాణ లో అత్యధిక గురుకులాలు పెట్టారని చెప్పారు.
చదువుకునే ఈ వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే సీఎస్‌ఆర్ నిధులు ఎంతో అవసరం అన్నారు. డిజిటల్ లీడర్షిప్ ప్రోగ్రాం లో మరింత మందిని భాగస్వామ్యం చేయాలని కోరుతున్నానని చెప్పారు.
ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబానికి కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది…..ఇంకా ఈ కార్యక్రమాలు ఎక్కువ మందికి చేరేందుకు ఏమి చేయాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా వల్ల 10 నెలలు కోల్పోయాము…. ఇక నుంచి సమయం కోల్పోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్న మెంటర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఇలాంటి అవకాశాలు అక్కడ కల్పించాలని కోరారు.
ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కచ్చితంగా మన గిరిజనులకు ఉపయోగపడుతాయని తెలిపారు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా. మీరు మీ పరిసరాల్లో స్ఫూర్తిగా తయారు అవుతారని చెప్పారు. ఈ నడక మీతో పాటు మీ వాళ్లందరినీ ముందుకు తీసుకెళ్లాలి అని ఆశిస్తున్నానని చెప్పారు స్పెషల్ సెక్రెటరీ శ్రీధర్. Csr సరిగా వినియోగించగలిగితే ఎలా ఉంటుందనే దానికి ఈ సమావేశం నిదర్శనం అన్నారు శ్రీధర్. ట్యాబ్స్ ఇస్తున్న now సంస్థ వారికి కూడా ధన్యావాదాలు చెప్పారు. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం అన్నారు దాత సౌమ్య.