రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు చేపడుతున్నారని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మాహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె…కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రంలో మరణాలు పెరగకుండా సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని వెల్లడించారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోన వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కానీ వాటిని భూతద్దంలో చూపి ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రములో ఎన్నో సంస్థలు ,సంఘాలు సీఎం కేసీఆర్ పిలుపుకు స్పందించి ఎంతో సహాయం చేశాయని…నిన్న మొన్న మంత్రి కేటీఆర్ ఒక్క పిలుపునిస్తే పార్టీ పరంగా 104 అంబులెన్సులు ఇచ్చి ప్రజాప్రతినిధులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు.
ఇవాళ నిర్మాన్ సంస్థ మాహబూబాబాద్ జిల్లాలో 450 మంది కోవిడ్ బాధితులకు కిట్స్ ఇచ్చినందుకు సంస్థ యాజమాన్యానికి దాన్యవాదలు తెలుపుతున్నానని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్.