మహిళా బంధు…సీఎం కేసీఆర్

107
sabitha
- Advertisement -

సీఎం కేసీఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుక్ర‌వారం రవీంద్ర భారతిలో రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారిని ఘ‌నంగా స‌న్మానించారు.

సమాజంలో సగ భాగం మహిళలు అని వారి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంద‌న్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతి విద్యార్థి వారి అమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. అమ్మ,అమ్మమ్మకు మించిన రోల్ మోడల్ సమాజంలో ఇంకెవరు ఉండ‌ర‌ని ఆమె అన్నారు.

మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి . మ‌హిళలు అంటే వంటింటికి పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కానీ అందరికీ సమాన అవకాశాలు కావాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ మహిళా దినోత్సవం అని ఆమె పేర్కొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే మహిళల రోజు కాదు.. ప్రతి రోజు మహిళా రోజే అని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పేర్కొన్నారు. మహిళ కుటుంబంలో, సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర పోషిస్తుందన్నారు. గత ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదు అని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -