- Advertisement -
తెలంగాణలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని తెలిపారు.
మాస్కులు ధరించి,భౌతిక దూరం పాటిద్దాం.కరోనా వ్యాప్తిని కట్టడి చేద్దాం.విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.మరోవైపు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
- Advertisement -