- Advertisement -
1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన నిర్వహిస్తామని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జూన్ 13 నుంచి పాఠశాలల పున:ప్రారంభం యధావిధిగా కొనసాగుతోందని…ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. టెట్ ఎగ్జామ్ నిర్వహణ బాగా జరిగిందన్నారు.
అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. యథావిధిగా బుక్స్, యూనిఫార్మ్స్ కూడా అందిస్తామని చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచించామని తెలిపారు. కరోనా వల్ల రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తం మారిందన్నారు. అన్ని స్కూల్స్ లో మిషన్ భగీరథ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -