అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ కార్యాలయంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఎమ్మార్వో విజయ రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ సంఘటనలో విజయ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. మంటలు ఆర్పే క్రమంలో డ్రైవర్ గురునాదంకు మంటలు అంటుకొని 90% కాలిపోయాడు. వెంటనే ఆతడిని హాస్పిటల్‌కి తరలించారు. ఇదే క్రమంలో మరో వ్యక్తి చందరయ్య(ఫూన్) కి కూడా గాయాలయ్యాయి.
కాగా మృతురాలు ఎమ్మార్వో విజయ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా నకిరేకల్. భర్త సుభాష్ రెడ్డి హాయత్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ కళాశాలలో లెక్షరర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఒక బాబు,ఒక పాపా ఉన్నారు.
ఈ సంఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. తమకు ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చే సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలి. అంతే తప్ప ఇలా అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని మంత్రి అన్నారు. విషయం తెలిసి వెంటనే సంఘటన స్థలానికి బయల్దేరారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విషయం తెలిసి వెంటనే సంఘటన స్థలానికి బయలుదేరి విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని సిపి కి ఆదేశాలు జారీచేశారు.