బజర్ధస్త్ జడ్జీగా రోజా రీ ఎంట్రీ

221
- Advertisement -

జబర్థస్త్‌ షోకి మళ్లీ జడ్జ్‌ గా ఏపీ మంత్రి రోజా వచ్చారా అంటే.. జబర్థస్త్‌ షోకి రోజా జడ్జీగా రావడమేంటి అని అనుకుంటున్నారా? అవును.. బజర్దస్త్ షోకి జడ్జీగా మళ్లీ రోజా వచ్చారు. రోజా గత 10 సంవత్సరాలుగా జబర్దస్త్ షోకు జడ్జీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల క్రితం రోజా ఏపీలో మంత్రిగా అవకాశం రావడంతో ఆమె జబర్దస్త్‌ షోను అయిష్టంగానే విడిచివెళ్లారు అన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఆమె మరోసారి జబర్దస్త్ షోలో జడ్జీగా ప్రత్యక్షమయ్యారు. తాజాగా జబర్దస్త్ ప్రోమో చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఈ ప్రోమోలో జబర్దస్త్ కు జడ్జీలుగా వ్యవహరిస్తున్న కృష్ణభగవాన్, ఇంద్రజలతో పాటుగా రోజా కూడా జడ్జీగా వ్యవహరించారు. అయితే రోజా తిరిగి జబర్దస్త్‌కు జడ్జీగా రావడానికి కారణం ఏంటంటే… జబర్దస్త్ ప్రోగాం ప్రారంభమయ్యి.. ఇప్పటి వరకు 500 ఎపిసోడ్‌ లు పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ ప్రోగ్రాం టీం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో రోజా తనదైన పంచులు, నవ్వులతో అలరించారు.

అనంతరం రోజాను జబర్దస్త్ షోం టీం ఘనంగా సన్మానించినట్టు తెలుస్తోంది. ఈ వేదికపై రోజా మాట్లాడుతూ తనతో పాటు హీరోయిన్స్‌ గా వచ్చిన వారందరిని ఇప్పటి తరం మర్చిపోయిందని.. కానీ తనను మాత్రం గుర్తు పెట్టుకున్నారంటే.. కేవలం జబర్దస్త్ వల్లే అది సాధ్యమయిందని రోజా ఏమోషనల్‌ అయ్యారు. మొత్తానికి జబర్దస్త్‌ షోలో రోజా తిరిగి జడ్జీగా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు.

- Advertisement -