- Advertisement -
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం పట్టణంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా మంత్రి ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ 38వ డివిజన్ నందు నూతనంగా నిర్మించిన మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ను మేయర్ పాపాలాల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖమ్మం కార్పొరేషన్ 11వ నందు రూ. కోటి తో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు చెరువు బజార్ వద్ద శంకుస్థాపన చేశారు మంత్రి పువ్వాడ. అలాగే ఖమ్మం టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో కార్యాలయ ఇంచార్జి ఆర్‌జేసీ కృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మీటింగ్ హాల్‌ను ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
- Advertisement -