రాష్ట్రానికి సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష: మంత్రి పువ్వాడ

163
puvvada
- Advertisement -

రాష్ట్రానికి సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై బీజేపీ దద్దమ్మ లు ఎందుకు మాట్లాడడం లేదు అని మండిపడ్డారు. డొల్ల పార్టీలు, పాన్ డబ్బా పార్టీలకు దీటైన సమాదానం ఇచ్చి టీఆర్ఎస్ ను గెలిపిస్తాం అని స్పష్టం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 1లక్ష 30 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ కి దక్కిందని తెలిపిన పువ్వాడ..ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను స్పష్టంగా చెబుతున్నాం… పోటీ చేసే మీ పార్టీ లు ఏమి చేశాయో చెప్పే ధైర్యం ఉందా అని దుయ్యబట్టారు.

దేశం లో నిరుద్యోగనికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా అని అడిగారు. ప్రభుత్వ సహకరం వల్లనే ప్రైవేట్ రంగం లో 5 లక్షల ఉద్యోగాలను ఇచ్చాము. కాంగ్రెస్, బీజేపీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

- Advertisement -