మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్దే గెలిపిస్తుంది..

802
vemula-prashanth-reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నిన్ననే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పైన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత అన్ని ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచి గెలిపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి పైన పూర్తి నమ్మకం ఉంచుతారని పూర్తి విశ్వాసం మాకు ఉన్నది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఎన్నడూ చూడని నిధులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగిందన్నారు.

ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు వందల కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ది ప్రజల కల్ల ముందే కనిపిస్తుంది. గతంలో మున్సిపాలిటిల్లో మాటల మట్టుకే పనులు జరిగాయి. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాక చేసి చూపించారని అన్నారు. మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్దే మా గెలుపుకు కారణమవుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -