రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలు గోటికి సరిపోడు- మంత్రి వేముల

160
minister vemula
- Advertisement -

ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, వాడిన పదజాలంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. వారు ఈరోజు టీఆర్‌ఎస్‌ఎల్సీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, రేగా కాంతా రావు, ఎమ్మెల్యే జి .విఠల్ రెడ్డి, మాజీ ఎంపి జి .నగేష్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ఇంద్రవెళ్లిలో నోటి తీటను తీర్చుకున్నారు.కేసీఆర్‌ను తిట్టి శునకానందం పొంది సభను ముగించారు. రేవంత్ రెడ్డిపై మాకు జాలి కలుగుతుంది. రేవంత్ రెడ్డి చరిత్రను మరిచి చాలా మాటలు మాట్లాడారు. 1981లో ఇంద్రవెళ్లిలో వందలమంది ని పిట్టలను కాల్చినట్లు కాల్చిన పార్టీ కాంగ్రెస్. ఇందిరాగాంధీ సాక్షిగా వందలమంది ఆదివాసుల బిడ్డలను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ ది. కాంగ్రెస్ సభను చూస్తుంటే గిరిజనుల గుండెలు మండినవి. ఆనాడు గిరిజనులను చంపి- ఇవ్వాళ స్మారకం కడతారా? శవాలపై పేలాలు ఎరుకునే రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు బిక్షతో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. ప్రజలు ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలో రేవంత్ వివరణ ఇవ్వాలి..రోజుకో మాట – పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డిని నమ్మలా?.. అని మంత్రి ప్రశ్నించారు.

సోనియా గాంధీ రాజ్యం అంటే – వందల మంది యువత ఆత్మబలిదానం చేసుకున్న రాజ్యం కావాలా?..2009 వరకు తెలంగాణ ఇవ్వకుండా లాగి లాగిన ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న సోనియమ్మ ను నమ్మలా?.. సోనియా గాంధీ దయ్యం – బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇవ్వాళ తెలంగాణ తల్లి సోనియాగాంధీ అంటుండు..రేవంత్ రెడ్డిది నోరా తాటి మట్టనా!..దళితుల పేరుతో ఓట్ల డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది – రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్ట్. దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ దేశం- రాష్ట్రంలో ఒక్క పథకం తెచ్చిందా?..60ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క దళిత వ్యక్తిని ప్రధాని చేసిందా?.. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని సీఎం చేసిందా?.. రేవంత్ రెడ్డి- కాంగ్రేస్ పార్టీలాగా టీఆర్ఎస్ డ్రామా కంపెనీ కాదు.. 70ఏళ్ల రాజకీయ చరిత్రలో దళితబంధు లాంటి పథకాలు తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ వేషాలు వేస్తున్నాడు అని మంత్రి వేముల మండిపడ్డారు.

హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి.. రేవంత్ బాధ్యత తీసుకోని గెలిపియ్యి.. హుజురాబాద్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఉడిపోతుందని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా వలసపాలకుల పంజరంలో ఆంధ్రనేతల కోసం పలికే చిలుక అన్నారు. ఇంతకు ముందు చెర్లపల్లికి టెంపరరీగా వెళ్లిన రేవంత్ రెడ్డి ఇక పూర్తిగా జైల్ పాలు కానున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని బుడ్డర్ ఖాన్ వేషాలు వేసినా కేసీఆర్ కాలు గోటికి సరిపొడు అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.

- Advertisement -