ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాల కోరు- మంత్రి వేముల

339
- Advertisement -

నేడు మోతే గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ళను త్వరితగతిన చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్లు మందకొడిగా సాగితే ఊరుకునేది లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ అనంతరం మీడియాతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయని విధంగా రైతులు పండించే ఆహార ధాన్యం మొత్తం సీఎం కేసీఆర్ ప్రభుత్వమే కొంటుందన్నారు. ఓ పెద్దమనిషి నోటికొచ్చినట్లు అబద్దాలు ఆడుతున్నారని,ఆయన అజ్ఞానానికి నవ్వాలో..ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలు మొత్తం కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ భరిస్తుంది అని మాట్లాడుతున్నాడు. అబద్దాలు ఆపి నిజాలు తెలుసుకోవాలని ఎంపీ అర్వింద్ ను ఉద్దేశించి అన్నారు.

రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి ఈ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ 25 వేల కోట్లు లోన్ తెచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతుల వద్ద నుంచి వారిధాన్యం మొత్తం మేమే గోనుగోలు చేస్తున్నాం.. ఆరు నెలలకు కేంద్రం కొంటె కొంటుంది లేకుంటే లేదని తెలిపారు. 25 వేల కోట్లకు 1000కోట్ల వడ్డీ భారం కేసీఆర్ ప్రభుత్వం భరిస్తుందని,ఆ వెయ్యి కోట్లు,ట్రాన్స్పోర్ట్ కేంద్రం దగ్గరి నుంచి ఇప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు.

prashanth reddy

తెల్ల జొన్నలు ఒక్క గింజ కూడా కేంద్రం కొనుగులు చేస్తలేదని,మక్కలు30శాతమే కొంటుందని తెలిపారు.మక్కల కొనుగోలుకు3,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని తెలిపారు. సన్ ఫ్లవర్ కూడా 25 శాతం గింజను మాత్రమే కొంటుందన్నారు. శనిగలు కూడా 25 శాతం కేంద్రం కొంటె 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందని..శనగలు కొనుగోలు కోసం 700కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రైతుల మీద ఎంపీ కి అంతా ప్రేముంటే తెల్ల జొన్నలు, సన్ ఫ్లవర్ కొనుగోలు కోటా పెంచి ట్రాన్స్ పోర్ట్, మిల్లింగ్ చార్జీలు ఇప్పించాలన్నారు.

ప్రజలు, రైతులు ఎవరు ఎం చేస్తున్నారో.. మాట్లాడుతున్నారో గమనిస్తున్నారని..విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సరైందికాదన్నారు. అర్వింద్ కు అంత ప్రేమ ఉంటే రైతుల డిమాండ్ మేరకు పసుపు బోర్డు తీసుకురావాలని..అమ్మడానికి సిద్ధంగా ఇంట్లో అలాగే ఉన్న పసుపును కేంద్రంతో మద్దతు దరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. బాల్కనీలో నిలబడి రోజుకొక అబద్ధం ఆడటం కాదు, రైతులకు మేలు చేసే ఆలోచన చేయాలని సూచించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం భరిస్తూ కొంటుందని,ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని.. అబద్దాలు అరవింద్ కు అలవాటుగా మారాయన్నారు.

mp aravind

అబద్దాలతో ఒకసారి ప్రజల్ని మోసం చేసినా,ఎప్పుడూ అలాగే చేస్తా అంటే ఇక ప్రజలు నిన్ను నమ్మరన్నారు. మోడీ నీకు మంచి దోస్త్ అయితే,నీ పరపతి కేంద్రం దగ్గర అంత బాగా ఉంటే రైతులకు మేలు చేయి. ఎంత భారమైన పర్వాలేదు..రైతు పండించిన పంట కచ్చితంగా మనమే కొందామని.. రైతుల సంక్షేమం ఆలోచించే కేసీఆర్ మీద మాట్లాడే అర్హత నీకు లేదని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారని,మాకేం ఎక్కువ చేసింది ఏం లేదన్నారు.

కరోనా నేపధ్యంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేసింది రెండే పనులని.. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తే… రాష్ట్రం 7 కిలోల బియ్యం కలిపి 12 కిలోలు ఇస్తోందన్నారు. 500 రూపాయలు కేంద్రం ఇస్తే 1500 కేసీఆర్ ఇచ్చారన్నారు. కేంద్రం ఇచ్చే దానిలో రెండింతలు రాష్ట్రం ఇస్తోందని తెలిపారు. ఎన్ని అబద్దాలైన మాట్లాడుతా ప్రజల్ని మోసం చేస్తా అంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -