బీజేపీకి రాజకీయ ప్రయోజనం తప్పా.. ప్రజా సంక్షేమం పట్టదు..

140
Minister Prashanth Reddy
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం రామన్నపేట గ్రామంలో ఈరోజు పీఏసీఎస్ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా ఇబ్బందులు ఉన్నా రైతుల క్షేమం కోసం ఆలోచించి బ్యాంకు రుణం తెచ్చి మరీ రైతుల వద్ద పంట కొనుగోలు చేస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో 442 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అయినందునే గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు.

అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలే లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే రైతు పక్షపాతి అయిన కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసాగా నిలిచారన్నారు. అవాకులు, చవాకులు మాట్లాడే బీజేపీ నేతలు దీన్ని గమనించాలన్నారు. వాళ్లకు రాజకీయ ప్రయోజనం తప్పా.. ప్రజా సంక్షేమం పట్టదన్నారు. అలాగే తేమ, తాలు లేని ధాన్యం తీసుకు రావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. గన్నీ సంచుల కొరత లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

- Advertisement -