సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం..

120
kcr
- Advertisement -

బాల్కొండ నియోజకవర్గానికి కొత్తగా 7 చెక్ డ్యాంలు మంజూరు చేసినందుకు ఆయా గ్రామాల రైతులు,నాయకులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులు,ప్రజలు, నాయకులు, కార్యకర్తల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.

బాల్కొండ నియోజకవర్గంలో కొత్తగా 7 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయి. ఈమేరకు రూ. 57 కోట్ల 9 లక్షల పరిపాలన మంజూరీ ఇస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి దయతో మరో 7 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంజూరీ ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసిఆర్ కి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి మరో 7 నూతన చెక్ డ్యాంలు మంజూరీ ఇస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. నియోజకవర్గంలోని పెద్ద వాగు మీద 4, కప్పల వాగు మీద 3 చెక్ డ్యాం లు నిర్మాణానికి సుమారు రూ. 57 కోట్ల 8 లక్షల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు ఇచ్చింది. బాల్కొండ రైతుల ప్రయోజనాల దృష్ట్యా 7 చెక్ డ్యాంలకు మంజూరీ ఇచ్చిన రైతు భాందవుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి అన్నారు.

ఇటీవలే 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికీ మంజూరీ ఇచ్చిన కేసిఆర్ ,నేడు 57 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణానికి మంజూరీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతు నాయకుడు, మంత్రి తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి ఆశయాలు,ఈ ప్రాంత వాసుల కోరిక తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఈ నిర్మాణ మంజూరీలు బాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతేకమైన ప్రేమకు నిదర్శనం అన్నారు.

మంజూరీ అయిన చెక్ డ్యాం ల వివరాలు:

1.మోర్తాడ్ మండలం శెట్పల్లి పెద్ద వాగు పై 8.46 కోట్ల వ్యయం
2.మోర్తాడ్ మండలం పాలెం మరియు దోన్కల్ గ్రామాల మధ్య పెద్ద వాగుపై 11.24 కోట్ల వ్యయం
3.వేల్పూర్ మండలం రామన్న పేట గ్రామం వద్ద పెద్దవాగు పై సుమారు 8.61 కోట్ల వ్యయం
4.వేల్పూర్ మండలం వేల్పూరు మరియు జానకం పేట గ్రామాల మధ్య పెద్ద వాగు పై 7.45 కోట్ల వ్యయం
5.భీంగల్ మండలం బెజ్జొర మరియు భీంగల్ గ్రామాల మధ్య కప్పల వాగుపై సుమారు 5.69 కోట్ల వ్యయం
6.భీంగల్ మండలం సాలంపూర్ మరియు సికింద్రాపూర్ మధ్య కప్పల వాగుపై సుమారు 9.38 కోట్ల వ్యయం
7.మెండోర మండలం వెల్కటూర్ గ్రామం వద్ద కప్పల వాగు పై సుమారు 6.26 కోట్ల వ్యయం

- Advertisement -