- Advertisement -
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. వసంత్ విహార్లో నిర్మిస్తున్న భవన్ పనులను పరిశీలించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అనంతరం ప్రత్యేక పూజలు చేసి నిర్మాణపనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. లోవర్ గ్రౌండ్ త్రవ్వకం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.పుటింగ్ పనులు ప్రారంభం కోసం ఈ రోజు ముగ్గు పోశారు. మిగతా పనులు త్వరలో పూర్తి చేయనున్నారు.
క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించిన అనంతరం వర్క్ ఏజెన్సీతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన నిర్మాణ పనులు జరగాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగంగా అలాగే నాణ్యతతో జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -