నల్ల జెండా ఎగురవేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

81
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై నిరసన చేపట్టిన టీఆర్ఎస్ ఇవాళ నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టేవరకు నిరసన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇక ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. మిముల్ని నమ్మి పంట వేసిన రైతన్న పంట కొనిపిస్తానన్న దళారి ఏడి? అని మండిపడ్డారు.

- Advertisement -