గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కొంతమంది కావాలని పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇల్లు లేని పేదలు ఆందోళన చెందవద్దని.. దశలవారీగా ఇంటి నిర్మాణాల కోసమే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఖాళీ స్థలం ఉన్న ఎవరైనా సరే గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవచ్చని…. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Also Read:పచ్చి అరటికాయ తింటే ఎన్ని ప్రయోజనాలో..!
గృహలక్ష్మి..మార్గదర్శకాలివే
()మహిళల పేరిటే గృహలక్ష్మి పథకం మంజూరవుతుంది.
()దరఖాస్తుదారులు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
()దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి.
() ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి.
() ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం ఉండాలి.
() లబ్ధిదారుడు లేదా ఆ కుటుంబసభ్యుల పేరిట ఆహార భద్రత కార్డు ఉండాలి.
Also Read:త్రీ క్యాపిటల్స్ జగన్ కు దెబ్బేనా?
() దరఖాస్తుదారుడు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
() బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. తప్పనిసరిగా ప్రభుత్వ బ్యాంకు ఖాతానే ఉండాలి.
() జన్‌ధన్ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించరాదు.
() ఇప్పటికే ఆర్సీసీ చెత్తుతో ఇల్లు ఉన్నా,జీవో 59కింద లబ్ధిపొందినా ఈ పథకం వర్తించదు.