ధోల్పూర్ స్టోన్ వర్క్ షాప్‌ను పరిశీలించిన మంత్రి వేముల బృందం..

181
Minister Prashant Reddy
- Advertisement -

రాజస్థాన్‌లోని బడీ తలాబ్ షాహీ టౌన్ క్వారి వర్క్ షాప్,దోల్పూర్ స్టోన్‌ను అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శ‌నివారం ప‌రిశీలించింది. క్వారీలో క‌లియ‌తిరిగిన మంత్రి స్టోన్ త‌యారీని ప‌రిశీలించి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణానికి వాడనున్న ఎర్రరాయిని పరిశీలించేందుకు మంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

శుక్రవారం ఢిల్లీలో పార్లమెంటు భవనం, రాష్ట్రపతిభవన్‌లోని పలు నిర్మాణాలను పరిశీలించారు. శ‌నివారం ఆగ్రాలోని తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శ‌న అనంత‌రం ప‌క్క‌నే ఉన్న ఆగ్రా ఫోర్ట్‌ను వేముల బృందం ప‌రిశీలించింది. అక్క‌డినుంచి రాజస్థాన్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరివెళ్లింది. బృందంలోని సభ్యులు ఆయా క్వారీల్లో రాయిని పరిశీలించి, అవసరమైన రాయి గురించి యజమానులతో చర్చించనున్నారు.

- Advertisement -