- Advertisement -
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్నారని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఏపీ ప్రాజెక్టులపై మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులు అక్రమం అని విమర్శించారు. ఆయా ప్రాజెక్టులు అక్రమం కాబట్టే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్మాణాలు ఆపేయాలని ఆదేశించిందని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టు సాయంతో రోజుకు 7.7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, పాలమూరు, ఖమ్మం ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని మంత్రి వేముల పేర్కొన్నారు. ఏపీ ఆఖరికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు కూడా అవాస్తవాలు చెబుతోందని విమర్శించారు.
- Advertisement -