26న తొలి బోనం..పొన్నం రివ్యూ

5
- Advertisement -

జూన్ 26న తొలి బోనం గోల్కొండలో ప్రారంభం అవుతుంది అని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ బోనాల నేపథ్యంలో రివ్యూ నిర్వహించిన పొన్నం…బల్కంపేట , ఉజ్జయిని మహంకాళి ,లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి అని తెలిపారు.రంగం, తొట్టెల ఊరేగింపు ఉంటుంది..ఇప్పటి వరకు ప్రాథమికంగా రూ. 20 కోట్లు కేటాయించాం అన్నారు.

దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ& ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండగ లకు ముందే పూర్తి చేయాలి…అధికారులు ఉద్యోగం లాగ కాకుండా సేవ చేస్తున్నామనే దృక్పథంతో చేయండి అన్నారు. ఉజ్జయిని మహంకాళి ,లాల్ దర్వాజ,బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయండి… సాంస్కృతిక కార్యక్రమాలు , ఐ అండ్ పి ఆర్, బోనాల పై కర్టెన్ రైజర్ చూడాలి అన్నారు.

జీహెచ్ఎంసీ శానిటేషన్ , రెవెన్యూ భారీకెడ్లు, లైటింగ్ ,వాటర్ ఫెసిలిటీ ,కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలి…పోలీసులు లా అండ్ ఆర్డర్‌కు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్ మెంట్స్‌తో సమన్వయం చేసుకోవాలి…అధికారులు ఎక్కడ లోపం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నారు.

Also Read:TTD: శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

- Advertisement -